అమ్మ అనే అనుభూతి ఎలా ఉంటుందో తెలిసొచ్చింది: సాయిపల్లవి
- నాగశౌర్య - సాయిపల్లవి జంటగా 'కణం'
- తల్లి పాత్రలో సాయిపల్లవి
- మార్చి 9వ తేదీన భారీ విడుదల
ఈ సినిమాలో తల్లిగా సాయిపల్లవి .. ఆమె కూతురుగా వెరోనికా నటించారు. ఈ సినిమా తల్లీబిడ్డల మధ్య గల అనుబంధానికి సంబంధించిన కథ కావడంతో, అమ్మ అనే అనుభూతి ఎలా ఉంటుందనేది తనకి తెలిసి వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో సాయిపల్లవి చెప్పింది. నా కూతురు పాత్రను చేసిన వెరోనికను వదిలి నేను ఉండలేకపోతున్నాను. అంతగా మా మధ్య ఒక బంధమనేది ఏర్పడింది. అమ్మ అనే భావన ఎంత అందంగా ఉంటుందో .. ఎంతటి ఆనందంగా వుంటుందో ఈ పాత్ర ద్వారా నాకు అర్థమైందంటూ చెప్పుకొచ్చింది.