శ్రీకాంత్ రెండవ తనయుడు కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు!
- హీరోగా శ్రీకాంత్ కి ఎంతో క్రేజ్
- 'నిర్మలా కాన్వెంట్' తో రోషన్ పరిచయం
- త్రిభాషా చిత్రంతో రెండవ తనయుడి ఎంట్రీ
రోషన్ తో పాటు 'రుద్రమదేవి' సినిమాలో శ్రీకాంత్ కూతురు 'మేథ' కూడా కనిపించింది. ఇక శ్రీకాంత్ రెండవ తనయుడు 'రోహన్' కూడా వెండితెరకి పరిచయమవుతున్నాడు. ప్యాషన్ క్రియేషన్స్ బ్యానర్ పై ఆకాశ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. తెలుగుతోపాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రభుదేవా ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్ర కోసం 'రోహన్'ను తీసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా ఊటీలో ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. విభిన్నమైన కంటెంట్ తో రూపొందుతోన్న ఈ సినిమాతో రోహన్ ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి మరి!