నెట్ సెర్చ్‌లో సన్నీ లియోన్‌ను పక్కకు నెట్టేసిన ప్రియా ప్రకాశ్..!
- సెర్చ్ ఇంజన్ 'గూగుల్'లో అత్యధిక శోధన
- 'మాణిక్య మలరాయ పూవే' పాటలో ఎక్స్ప్రెషన్తో క్రేజ్
- పాప్యులారిటీకి మాటలు రావడం లేదంటోన్న క్యూట్ గర్ల్
"ఒక్క పాటతో నాకు ఇపుడు దక్కుతున్న ఆదరణ నన్నెంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదు. నాకు అసలు మాటలు రావడం లేదు. మొత్తానికి నాకు చాలా ఆనందంగా ఉంది" అని ప్రియా 'ఇండియా టుడే'కి తెలిపింది. ముఖ్యంగా తనకు క్రేజ్ తీసుకొచ్చిన 'కనుబొమ్మ' ఎక్స్ప్రెషన్ గురించి ఈ క్యూట్ గర్ల్ వివరించింది. దర్శకుడు, తన సహ నటుడు రోషన్ తనను కొన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్లు ఇవ్వాలని కోరారని, అప్పుడే కనుబొమ్మ ఎక్స్ప్రెషన్ అలా ఒక్క టేక్‌లోనే వచ్చేసిందని ఈ ముద్దుగుమ్మ సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది.