రాశిఖన్నా విషయంలో దిల్ రాజు సందేహించాడట!
- ఆ పాత్రకి రాశిఖన్నా కరెక్ట్ కాదనుకున్నాను
- ఆ తరువాత సినిమా చూశాను
- ఆమె అద్భుతంగా చేసింది
- నా సందేహం తొలగిపోయింది
"ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నాను ఎంపిక చేసినప్పుడు, దర్శకుడి ఛాయిస్ కరెక్ట్ కాదనుకున్నాను. ఎందుకంటే ఆమె మొదటి నుంచి మాస్ సినిమాలలో సిల్లీ కేరక్టర్స్ నే చేస్తూ వస్తోంది. అలాంటి ఆమె ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో ఎంతవరకూ మెప్పించగలదనే సందేహం వచ్చింది. కానీ సినిమా చూసిన తరువాత నా సందేహం తొలగిపోయింది. 'వర్ష' పాత్రలో ఆమె పరిణతి చెందిన నటనను ప్రదర్శించింది. పాత్రను అర్థంచేసుకుని అందులో ఆమె ఒదిగిపోయిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను" అని అన్నారు. మొత్తానికి ఈ సినిమాతో రాశి ఖన్నా మంచి మార్కులనే కొట్టేసింది.