ప్రియా ప్రకాశ్ వీడియో హిట్ కావడం ప్రేమికుల రోజును నిరసించే వారికి ఒక సమాధానం: జిగ్నేష్ మేవానీ
- సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఆమె వీడియోలు
- ఇది ఆరెస్సెస్‌కు ఒక సమాధానం- జిగ్నేష్
- ఒకరిని ద్వేషించడం కన్నా ప్రేమించడాన్ని అధికంగా ఇష్టపడతామని భారతీయులు మరోసారి రుజువు చేశారు
- ప్రేమికుల రోజున హిందూ సంఘాలు హెచ్చరించిన నేపథ్యంలో వ్యాఖ్యలు
ఈ వీడియో హిట్ కావడం ప్రేమికుల రోజును నిరసించే ఆరెస్సెస్‌కు ఒక సమాధానమని తెలిపారు. ఒకరిని ద్వేషించడం కన్నా ప్రేమించడాన్ని అధికంగా ఇష్టపడతామని భారతీయులు మరోసారి రుజువు చేశారని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ రోజు ప్రేమ జంటలు కనపడితే బలవంతంగా పెళ్లిళ్లు చేస్తామని హిందూ సంఘాలు హెచ్చరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.