తెలంగాణ మంత్రి కేటీఆర్ కి యాంకర్ ప్రదీప్ వినతి!
- రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం చర్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు
- ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చిన యాంకర్
- ఆ పాఠశాల విద్యార్థులు టాయిలెట్, మంచినీళ్లు లేక ఇబ్బందులు పడుతోన్న వైనం
అలాగే, ఆ పాఠశాలకు మంచి నీటి సౌకర్యం కూడా లేదని తెలిపాడు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పాడు. తమ టీమ్ ఆ విద్యార్థుల సమస్యలను పరిశీలించిందని, వారి గురించి పట్టించుకోవాలని ప్రదీప్ కోరాడు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్కి కూడా ప్రదీప్ ఈ ట్వీట్ చేశాడు.