‘మెహబూబా’ సినిమా టీజర్‌పై ఆర్జీవీ సహా పలువురి ట్వీట్లు!
- తన కుమారుడు ఆకాశ్ పూరీ హీరోగా పూరీ కొత్త సినిమా
- పూరీ జగన్నాథ్ సినీ కెరీర్లోనే ఉత్తమమైన సినిమాలా ఉంది: వర్మ
- ఆకాశ్‌కి మంచి భవిష్యత్ ఉంది: ప్రియమణి
ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉందని, ఆకాశ్‌కి మంచి భవిష్యత్ ఉందని నటి ప్రియమణి ట్వీట్ చేసింది. ‘టీజర్ చాలా చాలా బాగుంది. పూరీ, ఆకాశ్ కాంబినేషన్లో ఈ సినిమా రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నా’ అని నటుడు వరుణ్ తేజ్ పేర్కొన్నాడు. వావ్ పూరీ సర్.. సూపర్బ్ అని దర్శకుడు అనిల్ రావిపూడి, రచయిత కోన వెంకట్ పేర్కొన్నారు.