'శ్రీనివాస కల్యాణం'లో నితిన్ జోడీగా నందిత శ్వేత
- సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం'
- దిల్ రాజు నిర్మాణంలో సెట్స్ పైకి
- నాయకా నాయికలుగా నితిన్ .. నందిత శ్వేత
దర్శకుడు సతీశ్ వేగేశ్న మాత్రం తన తాజా చిత్రంలో కథానాయికగా ఈ అమ్మాయిని తీసుకునే ఆలోచనలో వున్నాడని అంటున్నారు. దిల్ రాజు నిర్మాణంలో 'శతమానం భవతి' చేసిన సతీశ్ వేగేశ్న, అదే నిర్మాతతో కలిసి నితిన్ హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి 'శ్రీనివాస కల్యాణం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో కథానాయికగా నందిత శ్వేతను ఎంపిక చేయనున్నారు. ఈ సినిమాతోనైనా ఇక్కడ ఈ సుందరి జోరు కొనసాగుతుందేమో చూడాలి.