కేసీఆర్ లేకుంటే కేటీఆర్, హరీష్ రోడ్డెక్కి కొట్టుకుంటారు!: కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- కేటీఆర్, హరీష్ రావు మధ్య విభేదాలున్నాయి
- జగదీష్ రెడ్డి హత్య కేసుల్లో నిందితుడు
- ఆరు నెలల తరువాత జగదీష్ రెడ్డి మద్యం అమ్ముకోవాల్సిందే
జగదీష్ రెడ్డి అవగాహనా రాహిత్యంతో తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో జగదీష్ రెడ్డి పాత్ర లేనిపక్షంలో కేసీఆర్ ను ఒప్పించి కేసును సీబీఐకి సిఫార్సు చేయించాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ మదన్ మోహన్ రెడ్డి హత్య కేసులో జగదీష్ రెడ్డి ఏ-2 ముద్దాయి కాదా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే నూకాబిక్షం, కడారి రాంరెడ్డి హత్యల కేసుల్లో నువ్వు నిందితుడివా కాదా? అని అడిగారు. మద్య నిషేధ సమయంలో మద్యం అమ్ముతుంటే నీపై కేసు నమోదైందా? లేదా? చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.