అజిత్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నయనతార
- అజిత్ హీరోగా 'విశ్వాసం'
- దర్శకుడు శివతో మరోసారి
- నయనతార పాత్రకి ప్రాధాన్యత
ఈ సినిమా చేయడానికి నయనతార అంగీకరించిందనేది తాజా సమాచారం. గతంలో అజిత్ తో కలిసి నయనతార నటించింది. అయితే ఆమె స్టార్ డమ్ పెరిగిన తరువాత అజిత్ కలిసి చేస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. అజిత్ కాంబినేషన్ అనే కాదు .. తన పాత్ర కూడా బాగుండటంతోనే ఆమె డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు వున్నాయి.