తెరపైకి మర్డర్ మిస్టరీ .. ఇంతవరకూ చేయని డిటెక్టివ్ పాత్రలో త్రిష
- తమిళంలో త్రిషకి మంచి అవకాశాలు
- వెతుక్కుంటూ వచ్చిన డిటెక్టివ్ పాత్ర
- యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న కథ
మహిళా అపరాథ పరిశోధకురాలిగా రజనీ పండిట్ కు మంచి గుర్తింపు వుంది. ఎన్నో సంచలనాత్మకమైన కేసులను ఆమె పరిష్కరించింది. 1980లో ఒక మర్డర్ మిస్టరీని ఆమె ఛేదించిన తీరును కథాంశంగా తీసుకుని, దానికి దృశ్య రూపం ఇవ్వడానికి దర్శకుడు వెర్నిక్ సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి 'కుట్రప్పాయిర్చి' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నాడు. ఈ కథతో స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నప్పుడే, ఈ పాత్రకి త్రిష మాత్రమే న్యాయం చేయగలదని ఆయన భావించాడట. ఆయన త్రిషను సంప్రదించడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఇంతవరకూ చేయని డిటెక్టివ్ పాత్రలో తన సత్తా చూపాలనే ఆసక్తితో త్రిష ఉందట.