తెలంగాణ రాష్ట్ర 'ఫూలే విదేశీ విద్య' దరఖాస్తు గడువు పెంపు
- ఈ నెల 15 వరకు పొడిగింపు
- మరిన్ని వివరాలకు సంబంధిత అధికారులు లేదా వెబ్ సైట్ ను సంప్రదించాలి
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న
వాస్తవానికి విదేశీ విద్య నిధి దరఖాస్తు గడువు తేదీ జనవరి 31తో ముగిసింది కానీ, వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆ తేదీని పొడిగించినట్లు జోగు రామన్న తెలిపారు. మరిన్ని వివరాల కోసం జిల్లా, డివిజన్ బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారులను సంప్రదించాలని, బీసీ అభ్యర్థులు ఈపాస్ వెబ్సైట్లో హెచ్టీపీపీ //తెలంగాణ ఈపాస్ సీజీజీ.జీవోవీ.ఇన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.