చరణ్ సినిమా పాటలో నుంచే 'ఛలో' టైటిల్ వచ్చింది: నాగశౌర్య
- నా పాత్రను వెంకీ కుడుముల బాగా మలిచాడు
- టైటిల్ నేను అనుకున్నదే
- ఆ ఆలోచన అలా వచ్చింది
- అంతా బాగుందన్నారు
" దర్శకుడు వెంకీ కుడుముల .. నిజ జీవితంలో నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఈ సినిమాలో నా పాత్రను మలిచాడు. ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్టాలా అనే విషయంలో బాగా ఆలోచించాను. ఓ రోజున కారులో వెళుతూ చరణ్ 'బ్రూస్ లీ' సినిమాలోని 'లే ఛలో' పాట వింటున్నాను. నా సినిమాకి 'ఛలో' అనే టైటిల్ పెట్టాలనే ఆలోచన అప్పుడే వచ్చింది. అలా చరణ్ సినిమాలోని పాటలో నుంచే 'ఛలో' టైటిల్ వచ్చింది. ఈ టైటిల్ గురించి చెప్పగానే వెంకీ కుడుముల .. అమ్మానాన్నలు బాగుందన్నారు" అంటూ చెప్పుకొచ్చాడు.