అసంతృప్తితో చిరంజీవి .. మళ్లీ వాళ్లను రంగంలోకి దింపారట!
- 'సైరా'లో మార్పులు కోరిన చిరూ
- రంగంలోకి దిగిన పరుచూరి బ్రదర్స్
- ఫిబ్రవరి 2వ వారం నుంచి రెండవ షెడ్యూల్
ఈ సినిమా కథ విషయంలో మూలం దెబ్బతినకుండా అక్కడక్కడా మార్పులు చేస్తే బాగుంటుందని చిరంజీవి భావిస్తున్నారట. అలాగే సంభాషణలు కూడా తన పాత్ర స్థాయికి తగినట్టుగా లేవని ఆయనకి అనిపించిందట. దాంతో పరుచూరి బ్రదర్స్ ను .. సాయిమాధవ్ బుర్రాను మళ్లీ రంగంలోకి దింపినట్టు సమాచారం. ప్రస్తుతం వాళ్లు చిరూ సూచనల మేరకు కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఈ సినిమా రెండవ షెడ్యూల్ మొదలుకానుంది.