హీరోగా తెరంగేట్రం చేసిన గాయకుడు విజయ్ యేసుదాసు... ట్రైలర్ విడుదల
- పడైవీరన్ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ
- ఫిబ్రవరి 2న విడుదల
- కీలకపాత్ర పోషించిన డైరెక్టర్ భారతీ రాజా
మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విజయ్ యేసుదాసు చాలా హిట్ పాటలు పాడారు. అలనాటి గాయకుడు కేజే యేసుదాసు కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. ట్రైలర్ చూస్తే నటుడిగా కూడా విజయ్ ఆకట్టుకుంటాడనే నమ్మకం కలుగుతోంది. ట్రైలర్ చూసిన నటుడు దుల్కర్ సల్మాన్, విజయ్ నటనపై ప్రశంసలు కురిపించాడు.