అది మేక తలకాయ: రజనీకాంత్ పార్టీ గుర్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన శరత్ కుమార్
- రజనీవి అవకాశవాద రాజకీయాలు
- జయలలిత ఉన్నప్పుడు విదేశాలకు పారిపోయారు
- కావేరీ జల వివాదంపై ఆయన వైఖరి స్పష్టం చేయాలి
జయలలితకు భయపడి రజనీ 1996లో విదేశాలకు పారిపోయారని... ఆ తర్వాత మళ్లీ కరుణానిధి ప్రభుత్వం వచ్చాకే ఇక్కడకు తిరిగొచ్చారని అన్నారు. అవకాశవాద రాజకీయాలతో లబ్ధి పొందాలని అనుకుంటున్నారని విమర్శించారు. కావేరీ జల వివాదంపై రజనీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ శరత్ కుమార్ పైవ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారాయి.