ఇక అలాంటి సినిమా జీవితంలో చేయను: సంచలన నిర్ణయం తీసుకున్న దీపికా పదుకొనే
- ఆది నుంచి వివాదాల్లోనే 'పద్మావత్'
- ఇక అటువంటి సినిమాలను అంగీకరించను
- సన్నిహితులకు చెప్పిన దీపిక
ఇటీవల ఆమె ఓ ఈవెంట్ కు హాజరుకాగా, సన్నిహితుల వద్ద పరిస్థితి వివరించి వాపోయిన ఆమె, ఇక ఎప్పటికీ ఈ తరహా చిత్రాలను చేయలేనని వెల్లడించిందట. తన తల్లి, తండ్రి ఈ చిత్రాన్ని చూసి తనను అభినందించారని చెప్పిన దీపిక, చిత్రంలో ఖిల్జీ, రావల్ మధ్య జరిగే పోరాట దృశ్యం తనకు ఎంతో ఇష్టమైన సీన్ అని వెల్లడించింది. కాగా, గత వారంలో వెండితెరపై విడుదలైన 'పద్మావత్' నిదానంగా కలెక్షన్లను పెంచుకుంటూ వెళుతోంది.