రెండ్రోజుల్లో రూ. 50 కోట్ల మార్కు దాటిన 'పద్మావత్'
- రెండో రోజు పెరిగిన వసూళ్లు
- వివాదాలు, ఆందోళనలకు అతీతంగా చిత్రానికి ఆదరణ
- బూమ్ అంటూ ట్వీట్ చేసిన దీపికా పదుకునే
బుధవారం రాత్రి వేసిన ప్రీమియర్ షోల ద్వారా రూ. 4.25 కోట్లు, మొదటి రోజు థియేటర్ వసూళ్లు రూ. 17.75 కోట్లు రాగా, రెండో రోజు రూ. 32 కోట్లు వసూలు చేసింది. దీంతో రెండ్రోజుల్లోనే దాదాపు రూ. 53 కోట్లు ఆర్జించినట్లైంది. ఈ వసూళ్ల గురించి సినిమాలో పద్మావతి పాత్రలో నటించిన దీపికా పదుకునే ట్వీట్ ద్వారా స్పందించింది. 'బూమ్' అంటూ పిడికిలి గుర్తు ఎమోజీని ఆమె ట్వీట్ చేసింది.