నేను జాగ్రత్తగా ఉండాలని కొంత మంది సూచిస్తున్నారు: ప్రకాశ్ రాజ్
- ఇప్పటివరకు మాత్రం నాకు ఎటువంటి హెచ్చరికలు రాలేదు
- కాకపోతే పరోక్షంగా కొందరు నేను నటించిన సినిమాలను, యాడ్స్‌ను అడ్డుకోవాలని చూస్తున్నారు
- వారు ఎంత దూరం వెళతారో చూద్దాం
- నేను హిందువులకి వ్యతిరేకం కాదు
ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇప్పటివరకు ప్రత్యక్షంగా దాడులు చేయకపోయినప్పటికీ కొందరు మాత్రం పరోక్షంగా తాను నటించిన సినిమాలను, యాడ్స్‌ను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వారు ఎంత దూరం వెళతారో చూద్దామని అన్నారు. తాను హిందువులకు వ్యతిరేకం కాదని, తాను కేవలం మోదీ, అమిత్ షాలకు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు.