'రంగుల రాట్నం' ముందుకు .. 'రాజుగాడు' వెనక్కు!
- జనవరిలో 'రంగుల రాట్నం' రిలీజ్
- ఫిబ్రవరిలో 'రాజుగాడు' విడుదల
- రెండు సినిమాలు మహిళా దర్శకులతోనే
'రంగుల రాట్నం' సినిమాలో రాజ్ తరుణ్ .. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపించనున్నాడు. గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసే ఓ సంస్థలో ఆయన పనిచేస్తూ ఉంటాడట. శ్రీరంజని దర్శకురాలిగా పరిచయం కానున్న ఈ సినిమా ద్వారా, చిత్రా శుక్లా కథానాయికగా పరిచయం అవుతోంది. ఈ సినిమాతో రాజ్ తరుణ్ కి మరో హిట్ పడుతుందేమో చూడాలి మరి.