తదుపరి చిత్రానికి రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్న ఐశ్వర్య రాయ్
- ద్విపాత్రాభినయం చేయనున్న ఐష్
- 'రాత్ ఔర్ దిన్' సినిమాకు రీమేక్
- ఆ సినిమాలో హీరోయిన్ నర్గీస్ దత్
1967లో నర్గీస్ దత్ ప్రధాన పాత్రలో వచ్చిన 'రాత్ ఔర్ దిన్' సినిమాకు ఇది రీమేక్. ఇందులో నటించడానికి ఐశ్వర్య రాయ్ రూ. 10 కోట్లు అడిగిందని మిడ్నైట్ న్యూస్ పత్రిక పేర్కొంది. ఆమె డిమాండ్‌ను నిర్మాతలు వెంటనే అంగీకరించారని కూడా వెల్లడించింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేయనున్న కారణంగా ఆమె డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇచ్చేందుకు మారు మాట్లాడకుండా నిర్మాతలు అంగీకరించినట్లు సమాచారం.