'ఒక్క క్షణం' అల్లు శిరీష్ ను నిరాశ పరిచినట్టే!
- కొత్త కంటెంట్ తో వచ్చిన 'ఒక్క క్షణం'
- ఆశించిన స్థాయిలో లేని వసూళ్లు
- థియేటర్స్ కి వచ్చిన సమయం సరైనది కాదనే అభిప్రాయాలు
ఇంతకుముందు అల్లు శిరీష్ చేసిన 'కొత్తజంట' మొదటివారంలో 6 కోట్లను వసూలు చేస్తే, 'శ్రీరస్తు శుభమస్తు' 9 కోట్లను వసూలు చేసింది. 'ఒక్క క్షణం' ఆ వసూళ్లను అధిగమిస్తుందని అనుకున్నారు గానీ అలా జరగలేదు. మొదటివారంలో ఈ సినిమా 2.95 కోట్లను మాత్రమే రాబట్టిందని అంటున్నారు. థియేటర్స్ లో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' .. 'హలో' ఉండగా రావడమే ఈ సినిమా వసూళ్లు తగ్గడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.