వేసవిలో రానున్న రానా చారిత్రక చిత్రం!
- రానా హీరోగా 1945
- కథానాయికగా రెజీనా
- తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో విడుదల
సత్యశివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, 'సుభాష్ చంద్రబోస్' స్థాపించిన 'ఆజాద్ హింద్ ఫౌజ్'లో రానా ఓ సైనికుడిగా కనిపించనున్నాడు. రానా సరసన కథానాయికగా రెజీనా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. బ్రహ్మానందం .. నాజర్ .. సత్యరాజ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో వేసవిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.