వెంకీతో త్రివిక్రమ్ చేయనున్నది బాలీవుడ్ మూవీ రీమేక్?
- వెంకటేశ్ తో త్రివిక్రమ్ మూవీ
- బాలీవుడ్ రీమేక్ అంటూ టాక్
- గతంలో హిట్స్ కొట్టిన కాంబినేషన్
ఈ సినిమా తరువాత వెంకటేశ్ తో త్రివిక్రమ్ ఒక ప్రాజెక్టు చేయనున్నాడు. వెంకటేశ్ పుట్టిన రోజున హారిక హాసిని సంస్థ వారు ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది బాలీవుడ్ మూవీ 'జాలీ ఎల్.ఎల్.బి.కి రీమేక్ అని సమాచారం. బాలీవుడ్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అందుకే ఈ మూవీ రీమేక్ హక్కులను హారిక హాసిని బ్యానర్ వారు తీసుకున్నారట. ఈ సినిమా రీమేక్ నే వెంకటేష్ తో త్రివిక్రమ్ చేయనున్నాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే.