నా కళ్లు బాగుంటాయని చాలామంది అన్నారు: కేథరిన్
- హావభావాలు పలికించేది కళ్లతోనే
- అందువల్లనే నా కళ్లు బాగుంటాయన్నారు
- చిలిపితనాన్ని .. కోపాన్ని నా కళ్లు బాగా పలికిస్తాయి
'దర్శకుల పేర్లు మాత్రమే చెబుతున్నావు .. హీరోల పేర్లు చెప్పడం లేదు .. చెప్పొద్దని చెప్పారా?' అంటూ అలీ నవ్వుతూ అడిగారు. దానికి ఆమె స్పందిస్తూ, 'అదేం కాదు.. దర్శకులు .. కళ్లను ఇంట్రెస్టింగ్ పాయింట్ గా చూస్తారు గనుక, ఎమోషన్స్ ను పలికించేది కళ్లతోనే గనుక వాళ్లు అలా చెప్పేవారు. చిలిపితనాన్నే కాదు .. కోపాన్ని కూడా నేను నా కళ్లతో బాగా పలికిస్తాను" అంటూ కేథరిన్ చెప్పుకొచ్చారు. ఇక కెరియర్ ను మొదలు పెట్టిన తరువాత, ప్రతి రోజును .. ప్రతి సంఘటనను నేను ఒక అనుభవంగానే భావిస్తూ వచ్చాను" అని అన్నారు.