వెండితెరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ.. ప్రధాన పాత్రలో మమ్ముట్టి?
- దివంగత మాజీ సీఎం బయోపిక్‌లో మమ్ముట్టి
- దర్శకత్వం వహించనున్న మహి వి. రాఘవ్
- అంగీకరించిన వైఎస్ జగన్
ఈ చిత్రానికి మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘ఆనందో బ్రహ్మ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు మహి దర్శకుడిగా వ్యవహరించారు. వైఎస్సార్ బయోపిక్ తీయడానికి ఆయన కుమారుడు, వైకాపా అధినేత జగన్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరింత సమాచారాన్ని దర్శకుడు మహి వి. రాఘవ్ ప్రకటించనున్నారు.