జోరు మీదున్న శీరత్ కపూర్.. వరుస ఆఫర్లు!
- 'ఒక్క క్షణం'లో అలరించిన శీరత్ కపూర్
- త్వరలో 'టచ్ చేసి చూడు'తో ప్రేక్షకుల ముందుకు
- రవికాంత్ పేరెపు .. శ్రీధర్ సీపానకు గ్రీన్ సిగ్నల్
'రాజుగారి గది 2' .. 'ఒక్క క్షణం' సినిమాలతో యూత్ ను మరింతగా ఆకట్టుకున్న ఈ సుందరి, త్వరలో 'టచ్ చేసి చూడు' సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఆ తరువాత సినిమాను రవికాంత్ పేరెపు దర్శకత్వంలో చేయనున్న శీరత్ కపూర్, తాజాగా మరో డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం. కథ .. మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీధర్ సీపాన, ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా కోసం ఆయన శీరత్ కపూర్ ను సంప్రదించడం .. ఆమె ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.