క్రిస్మస్ సందర్భంగా సెక్యూరిటీకి స్వీట్లు పంచిన హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్!
- హైదరాబాద్ ఆఫీస్లో క్రిస్మస్ వేడుకలు
- ఫొటోలు షేర్ చేసిన కేథరీన్ హడ్డా
- 'రక్షిస్తున్న వారికి చిరు బహుమతి' అంటూ ట్వీట్
తాము కాన్సులేట్ కార్యాలయంలో జరుపుకున్న క్రిస్మస్ వేడుకల ఫొటోలను కేథరీన్ హడ్డా ట్విట్టర్లో షేర్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తమను రక్షిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి, పండుగ సీజన్ సందర్భంగా స్వీట్లు పంచిపెడుతున్నట్లుగా కేథరీన్ పేర్కొన్నారు. పోలీసులు, మహిళా సెక్యూరిటీ సిబ్బంది, బయట గార్డులకు కేథరీన్ స్వీట్లు పంచిపెడుతుండటం ఈ ఫొటోల్లో చూడొచ్చు.