నేను స్టేజ్ పై చెప్పే డైలాగ్స్ కి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు!: శరత్ కుమార్
- లారెన్స్ అడిగినప్పుడు ఒకే మాట చెప్పాను
- అలా జరగదని బలంగా చెప్పాడు
- వెంటనే ఆ పాత్ర చేయడానికి అంగీకరించాను
'లారెన్స్ నాకు ఈ కథ చెప్పినప్పుడు .. నేను ఒకటే మాట అన్నాను. 'ఫస్టు సీన్ లో నన్ను చూసి గనుక జనాలు నవ్వేస్తే ఈ సినిమా ప్లాప్ అవుతుంది' అని చెప్పాను. 'అలా ఎప్పటికీ జరగదు సార్ .. మీలాంటి హీరో చెబితేనే ఈ మెసేజ్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది .. మీరే చేయాలి' అని లారెన్స్ అన్నాడు. 'అప్పుడు ఆ పాత్ర చేయాలని నేను నిర్ణయించుకున్నాను'. ఆ సినిమాలో నేను స్టేజ్ పై వుండి చెప్పే డైలాగ్స్ కి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది .. నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది' అని చెప్పుకొచ్చారు.