రజనీకాంత్ సినిమా ఛాయలతో 'జై సింహా'?
- రెండు విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ
- ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు
- జనవరి 12న భారీస్థాయిలో రిలీజ్
గతంలో రజనీకాంత్ చేసిన 'ముత్తు' తరహాలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 'ముత్తు' సినిమా మాదిరిగానే ఈ సినిమాలోను బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపిస్తాడనీ, సెకండాఫ్ మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ తో నడుస్తుందని చెబుతున్నారు. ఇవన్నీ ఊహాగానాలేననీ .. 'ముత్తు' సినిమా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కావడం వలన ఇలా ప్రచారం జరుగుతోందనే వారూ లేకపోలేదు. ఈ ప్రచారానికి తెరదించేస్తూ బాలకృష్ణ ఈ సంక్రాంతికి సంచలన విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి మరి.