యాక్సిడెంటులో మరణించిన అభిమాని.. భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన తమిళ హీరో కార్తీ!
- నివాళులర్పిస్తూ ఒక్కసారిగా ఏడ్చేసిన నటుడు
- చనిపోయిన వ్యక్తి కార్తీ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జీవన్ కుమార్
అక్కడి తిరువన్నామలై కార్తీ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ జీవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన కార్తీ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. తర్వాత ఆ అభిమానికి నివాళులు అర్పిస్తూ ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యాడు. అక్కడున్న వారందరినీ చూసి కన్నీళ్లు ఉబికి వస్తుండగా పెద్దగా ఏడ్చేశాడు.