తమిళ రాజకీయాలను వేడెక్కించిన రజనీకాంత్!
- నేటి నుంచి ఫ్యాన్స్ తో తలైవా సమావేశాలు
- నెలాఖరు వరకు భేటీలు
- డిసెంబర్ 31న పార్టీ ప్రకటన?
ఈ నాటి సమావేశాల్లో రజనీ ఏం చెప్పబోతున్నారా? అనే ఆసక్తి సర్వత్ర నెలకొంది. నెలాఖరు వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మరోవైపు డిసెంబర్ 31న రాజకీయ పార్టీపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తారని మరికొందరు చెబుతున్నారు. ఈ సమావేశాల్లో రోజుకు వెయ్యి మంది అభిమానులను రజనీ కలవనున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఊహించని ఫలితాలు రావడంతో... రజనీ వేగం పెంచారని విశ్లేషకులు భావిస్తున్నారు.