సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా డ్యాన్సులు
- తమ్ముడి ఫంక్షన్ కు అల్లు అర్జున్
- మరో చిత్రంలో అల్లరి నరేష్
- 'దండుపాళ్యం' దర్శకుడితో శర్వానంద్
* అల్లు శిరీష్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన 'ఒక్క క్షణం' చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెల 25న హైదరాబాదులో నిర్వహిస్తారు. ముఖ్య అతిథిగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేస్తాడని సమాచారం.
* కామెడీ స్టార్ అల్లరి నరేష్ తాజాగా ఓ చిత్రానికి ఓకే చెప్పాడు. గతంలో 'నందిని నర్సింగ్ హోం' చిత్రాన్ని రూపొందించిన గిరి దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఇది కాకుండా నరేష్ ఇప్పటికే భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు.
* ప్రస్తుతం హను రాఘవపూడితో ఓ చిత్రం, సుధీర్ వర్మతో మరో చిత్రం చేస్తున్న యంగ్ హీరో శర్వానంద్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 'దండుపాళ్యం' ఫేం శ్రీనివాసరాజు దర్శకత్వంలో నటించడానికి శర్వా ఓకే చెప్పాడు.