సాయిపల్లవి గురించి అలా రాశారు .. అందులో నిజం లేదు: దిల్ రాజు
- సాయిపల్లవి సమయానికి షూటింగ్ కి వచ్చేసేది
- డేట్స్ పరంగా కూడా ఇబ్బంది పెట్టలేదు
- 'శ్రీనివాస కల్యాణం' కథ ఆమె విననే లేదు
"ఈ సినిమా కోసం ఇచ్చిన కాల్షీట్లను సాయిపల్లవి ఎగ్గొట్టిందనే వార్తల్లో నిజం లేదు. ఆమె బిజీగా ఉండటం వలన కొన్ని డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది. ఆ తరువాత తన కారణంగా షూటింగ్ ఆలస్యం కాకుండా సహకరించింది. ఇక ఆమె సమయానికి షూటింగ్ కి రాకుండా టీమ్ ను ఇబ్బంది పెట్టునట్టుగా కూడా రాశారు .. అందులోను నిజం లేదు. చెప్పిన సమయానికి ఆమె షూటింగ్ కి వచ్చేసేది. ఇక 'శ్రీనివాస కల్యాణం' కథ విని సాయిపల్లవి చేయనందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అసలామె ఇంతవరకూ ఆ కథనే వినలేదు" అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.