తాజ్ బంజారా, రూమ్ నంబర్ 402... హీరోయిన్ రిచా సక్సేనా గుట్టు రట్టయిందిలా!
- తాజ్ బంజారా హోటల్ లో అరెస్ట్
- నిర్ధారిత సమాచారాన్ని అందుకుని పోలీసుల దాడులు
- తాజ్ డెక్కన్ లో బెంగాలీ నటి కూడా
వీటిని గమనించిన పోలీసులు, సదరు ఐపీ అడ్రస్ పై, మోనిష్ కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో 'జూన్ 1:43' నటి రిచా, తాజ్ బంజారాకు వస్తున్నట్టు తెలుసుకున్నారు. బంజారాలోని రూమ్ నంబర్ 402ను ఓ విటుడి కోసం కడాకియా బుక్ చేశాడని, అక్కడికి రిచాను పంపాడని నిర్ధారిత సమాచారాన్ని అందుకున్నారు. ఇదే సమయంలో ఓ బెంగాలీ నటిని తాజ్ డెక్కన్ లో ఓ సినీ ప్రముఖుడు బుక్ చేసుకున్నాడన్న సమాచారం కూడా అందింది.
దీంతో బంజారాహిల్స్ ప్రాంతంలో పేరున్న ఈ రెండు హోటల్స్ పైనా ఏకకాలంలో దాడి చేశారు. పోలీసులు తమ వాహనాలు వదిలి, సూటు, బూటేసుకుని కస్టమర్ల మాదిరిగా హోటల్ లోనికి ప్రవేశించిన వీరు, వ్యభిచారానికి సహకరించిన తాజ్ బంజారా హోటల్ మేనేజర్ ను కూడా అరెస్ట్ చేశారు.