యువసేన నిరసనల కారణంగా సన్నీ లియోన్ ఈవెంట్ రద్దు
- భద్రత కారణాల దృష్ట్యా రద్దు చేయాలని ఆదేశించిన బెంగళూరు పోలీసులు
- కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు
- కన్నడ సంస్కృతిని సన్నీ నాశనం చేస్తోందన్న నిరసనకారులు
అయితే ఈ విషయం గురించి తమకు అధికారికంగా ఎలాంటి రాతపూర్వక ఆదేశం రాలేదని, కేవలం పోలీసులు ఈవెంట్‌ను ఆపాలని మాత్రమే చెప్పారని, ఈ విషయం గురించి హోం శాఖ మంత్రితో చర్చిస్తానని ఈవెంట్ నిర్వాహకుడు హరీష్ తెలిపారు. తమ ఆందోళనలు పట్టించుకోకుండా సన్నీ బెంగళూరు వస్తే ఆత్మహత్య చేసుకునేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు కర్ణాటక యువసేన హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.