'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!
- జగన్, మోదీ కలవడంపై 'ఆంధ్రజ్యోతి'లో కథనాలు
- పరువు నష్టం దావా వేసిన వైకాపా నేత ఆర్కే
- కోర్టుకు హాజరు కాని రాధాకృష్ణ
గతంలో వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు, 'ఆంధ్రజ్యోతి' పత్రిక తప్పుడు కథనాలు రాసిందన్నది ఆర్కే అభియోగం. ఈ కథనాలపై ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేయగా, ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది. రాధాకృష్ణ వరుసగా కోర్టుకు గైర్హాజరు అవుతుండటంపై న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఎన్బీడబ్ల్యూ జారీ చేశారు.