అమెరికాలో అత్యధిక థియేటర్స్ లో 'అజ్ఞాతవాసి'?
- ముగింపు దశకి చేరుకున్న 'అజ్ఞాతవాసి'
- అమెరికాలోను పెరుగుతోన్న క్రేజ్
- వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో అక్కడ రిలీజ్
- జనవరి 10న భారీ స్థాయి విడుదల
అక్కడ ఈ సినిమాను 209 ప్రాంతాల్లో విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అమెరికాలో 'బాహుబలి 2'ని 126 ప్రాంతాల్లో .. 'ఖైదీ నెంబర్ 150' మూవీని 74 ప్రాంతాల్లో .. 'కబాలి'ని 73 ప్రాంతాల్లో రిలీజ్ చేశారు. వీటన్నిటికీ మించి 'అజ్ఞాతవాసి'ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ పవన్ కి గల క్రేజ్ .. త్రివిక్రమ్ సినిమాలకి గల మార్కెట్ కారణంగా ఈ స్థాయిలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మలయాళంలోను ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.