అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తాప్సీ, దుల్కర్ సల్మాన్
- ఎట్టకేలకు పట్టాలెక్కనున్న 'మన్మర్జియాన్'
- ఆయుష్మాన్, భూమిల స్థానంలో దుల్కర్, తాప్సీ
- వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం
అయితే మొదట చిత్రంలో నటించడానికి ఆయుష్మాన్ ఖురానా, భూమి ఫడ్నేకర్‌లను అనుకున్నారు. కానీ కుదరలేదు. అలాగే దర్శకత్వ బాధ్యతలు కూడా సమీర్ శర్మ నుంచి అశ్వనీ అయ్యర్ తివారీకి, ఆయన దగ్గర్నుంచి చివరగా అనురాగ్ కశ్యప్‌కి చేరుకున్నాయి. బాలీవుడ్లో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే ఆయన 'కార్వాన్' అనే చిత్రంలోనటిస్తున్నారు. వచ్చే నెల హిమాచల్ ప్రదేశ్‌లో 'మన్మర్జియాన్' చిత్ర షూటింగ్ ప్రారంభకానుంది.