చారిత్రక నేపథ్యంలో సన్నీలియోన్ బహుభాషా చిత్రం .. కత్తియుద్ధంలో శిక్షణ!
- భారీ చారిత్రక చిత్రంలో సన్నీలియోన్
- కత్తియుద్ధం .. గుర్రపుస్వారీలో శిక్షణ
- ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్
- 70 నిమిషాల పాటు గ్రాఫిక్స్
పోన్స్ స్టీఫెన్ నిర్మాణంలో వి.సి.వడివుడయన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో 70 నిమిషాల పాటు గ్రాఫిక్స్ వుంటాయట. ఈ సినిమా కోసం 150 రోజుల కాల్షీట్స్ కేటాయించిన సన్నీలియోన్, కత్తియుద్ధంతో పాటు .. ఇతర యుద్ధ విద్యలలో శిక్షణ తీసుకుంటోందని అంటున్నారు. ఈ సినిమా కోసం నవదీప్ .. నాజర్ లను కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.