గోవాలో షూటింగ్ కి రెడీ అవుతోన్న బన్నీ
- హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న 'నా పేరు సూర్య'
- రేపటి నుంచి గోవాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ
- తెలుగుతో పాటు మలయాళంలోను విడుదల చేసే ఆలోచన
ఇప్పటికే ఈ సినిమా టీమ్ గోవా చేరుకుంది .. రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్ అక్కడ మొదలవుతుంది. ప్రధాన పాత్రధారులు పాల్గొనగా కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సీన్స్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని చెబుతున్నారు. అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ .. శరత్ కుమార్ కీలకపాత్రలను చేస్తున్నారు. తెలుగుతో పాటు మలయాళంలోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.