వీకెండ్ లో ఎంజాయ్ చేస్తున్న రాంగోపాల్ వర్మ, చార్మి, పూరి జగన్నాథ్... వీడియో చూడండి!
- నాగ్ హీరోగా సినిమా తీస్తున్న వర్మ
- నిర్మాణ పనుల కోసం హైదరాబాద్ లో వర్మ మకాం
- వీకెండ్ లో కలిసిన గురు శిష్యులు
- వైరల్ అవుతున్న వీడియో
శివ, అంతం, గోవిందా గోవిందా తరువాత వర్మ దర్శకత్వంలో పాతికేళ్ల తరువాత నాగార్జున హీరోగా 'కంపెనీ' పేరిట ఓ సినిమా తయారవుతుండగా, ఆ పనుల నిమిత్తం వర్మ ప్రస్తుతం హైదరాబాద్ లో మకాం వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే గురు శిష్యులు ఓ చోట చేరారు. ప్రస్తుతం పూరి తన కుమారుడిని హీరోగా రీ లాంచ్ చేస్తూ 'మెహబూబా' పేరిట చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరి వీకెండ్ పార్టీ వీడియోలను చార్మీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వర్మ, పూరి, ఆకాష్, చార్మీ సహా పలువురు ఈ వీడియోలో కనిపిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.