అల్లరి నరేశ్ తో 'సుడిగాడు' సీక్వెల్!
- 'తమిళ పడం' రీమేక్ గా వచ్చిన 'సుడిగాడు'
- తమిళంలో రెడీ అవుతోన్న సీక్వెల్
- ఈ సీక్వెల్ ను రీమేక్ చేసే ఆలోచనలో భీమనేని శ్రీనివాసరావు
తమిళంలో విజయాన్ని సాధించిన 'తమిళ పడం' సినిమాకి 'సుడిగాడు' రీమేక్. 'తమిళ పడం' సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది .. త్వరలోనే అక్కడి ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో 'సుడిగాడు' సినిమాను తెరకెక్కించిన భీమనేని శ్రీనివాసరావు, తమిళ సీక్వెల్ కి సంబంధించిన రీమేక్ రైట్స్ ను తీసుకున్నాడట. అల్లరి నరేశ్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని అంటున్నారు.