'సవ్యసాచి'లో చైతూ లుక్ కొత్తగా ఉంటుంది: చందూ మొండేటి
- చైతూ నటనలో కొత్త కోణం కనిపిస్తుంది
- ఎమోషన్స్ కి ప్రాధాన్యత
- టైటిల్ కి న్యాయం చేసేలా ఉంటుంది
ఈ సినిమాలో చైతూ చాలా కొత్తగా కనిపిస్తాడనీ .. ఆయన నటనలో కొత్తకోణం ఈ సినిమాలో కనిపిస్తుందని చందూ మొండేటి అన్నాడు. టైటిల్ కి న్యాయం చేసేలా ఈ సినిమా ఉంటుందనీ, యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయని చెప్పాడు. ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకి ప్రత్యేకంగా నిలుస్తాయని అన్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే.