అసలైన హారర్ మూవీ అంటే ఇదే .. 'గృహం' గురించి పబ్లిక్ టాక్!
- ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గృహం'
- ఉత్కంఠను రేకెత్తించే కథాకథనాలు
- ఊపిరి బిగపట్టేలా భయపెట్టేసే సన్నివేశాలు
- ఇది 100 పర్సెంట్ హారర్ మూవీ అంటోన్న ఆడియన్స్
ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అసలైన హారర్ మూవీ అంటే ఇదేనని అంటున్నారు. ఆసక్తిని రేకెత్తించే కథా కథనాలు .. ఉత్కంఠను కలిగించే సన్నివేశాలు ఊపిరిని బిగపట్టేలా చేశాయని చెబుతున్నారు. దర్శకుడు మిలింద్ టేకింగ్ .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని అంటున్నారు. చివరి 20 నిమిషాలు కుర్చీకి బిగుసుకుపోతామనీ, సిద్ధార్థ్ నటనలో కొత్త కోణం ఈ సినిమాలో కనిపిస్తుందని చెబుతున్నారు. 100 పర్సెంట్ హారర్ మూవీస్ చూడాలకునేవారికి ఇది సరైన సినిమా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.