ఒక పెద్ద హీరో నాకు ఫోన్ చేసి మరీ నీతులు చెప్పాడు: శివాజీరాజా
- మా అమ్మానాన్నలకు ఒక ఆర్టిస్ట్ లేనిపోనివి చెప్పాడు
- ఆ మాటలు నిజమని వాళ్లు నమ్మేశారు
- కొంతమంది శ్రీకాంత్ ను ఆరాతీశారు
- ఆ సమయంలో నన్ను ఆ ఇద్దరే సపోర్ట్ చేశారు
"నేనేంటో తెలిసిన కొంతమంది కూడా ఈ విషయంలో వాళ్ల నిజస్వరూపాన్ని చూపించారు. శ్రీకాంత్ కి ఫోన్ చేసి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇక ఒక పెద్ద హీరో అయితే నాకు ఫోన్ చేసి .. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలనే విషయంలో నీతులు చెప్పేశాడు. ఆ సమయంలో నన్ను సపోర్ట్ చేస్తూ ఇద్దరంటే ఇద్దరే ఫోన్ చేశారు. "అన్నా నువ్వెలాంటి వాడివో మాకు తెలుసు .. నువ్ బంగారానివి" అన్నారు. "ఆ ఇద్దరూ ఎవరో కాదు .. పోసాని కృష్ణమురళి .. వేణుమాధవ్" అంటూ చెప్పుకొచ్చారు.