నేను కోమాలో నుంచి బయటికి రాగానే చిరంజీవి దంపతులనే చూశాను: శివాజీ రాజా
- డ్రైవర్ కారును డివైడర్ కి గుద్దేశాడు
- నా జీవితంలో జరిగిన పెద్ద ప్రమాదం అది
- 13 రోజుల పాటు కోమాలో వుండిపోయాను
- ఇండస్ట్రీ అంతా అండగా నిలిచింది
"మా అసిస్టెంట్ కి కాళ్లు విరిగాయి .. మా డ్రైవర్ రెండు కళ్లూ ఊడిపోయి పడిపోయాయి. నా ఎడమభాగం మొత్తం బాగా దెబ్బతినేసింది. ఆ సమయంలో ఇండస్ట్రీ అంతా నా వెనకే ఉంటూ వాళ్ల ఇంట్లో మనిషిలా నన్ను బతికించి తీసుకొచ్చింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు 13 రోజుల పాటు కోమాలో వున్నాను. నన్ను చూడటానికి వచ్చిన చిరంజీవి గారు .. కోమాలో నుంచి బయటికి రాగానే తనకి కబురు చేయమని డాక్టర్స్ తో చెప్పారట. అలాగే నేను కోమాలో నుంచి బయటికి వచ్చి కళ్లు తెరవగానే, ఎదురుగా చిరంజీవి దంపతులు కనిపించారు .. అంతకన్నా ఏం కావాలి?" అంటూ చెప్పుకొచ్చారు.