రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'ఛలో'!
- 'ఛలో' సినిమా చేస్తోన్న నాగశౌర్య
- వేగంగా జరుగుతోన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు
- కథానాయికగా రష్మిక మందన పరిచయం
- డిసెంబర్ 29న విడుదల
వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పార్టీ ను పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమాను, డిసెంబర్ 29వ తేదీన విడుదల చేయనున్నారు. మణిశర్మ తనయుడు సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ఆడియో ఫంక్షన్ ను నిర్వహించనున్నారు. ఈ సినిమాతో నాగశౌర్యకి మరో హిట్ లభించడం ఖాయమనే టాక్ వినిపిస్తూ ఉండగా, రష్మిక మందన కెరియర్ కి ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుందని అంటున్నారు.