హాస్పిటల్ కు వెళ్లినంత మాత్రాన ప్రాణాంతక వ్యాధులు ఉన్నట్టేనా?: కోట శ్రీనివాసరావు
- ఆసుపత్రికి వెళ్లినంత మాత్రాన ప్రాణాంతక వ్యాధులు ఉన్నట్టేనా?
- తెలిసిన వారిని పరామర్శించేందుకు ఆసుపత్రికి కూడా వెళ్లకూడదా?
- ఈ వయసులో కంటి నొప్పో, కాళ్ల నొప్పులో రావడం సహజమే
తన వయసు 74 ఏళ్లని, ఈ వయసులో కంటి నొప్పో, కాళ్ల నొప్పులో రావడం సహజమేనని కోట చెప్పారు. తనకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారిని పరామర్శించడానికి వెళ్లకుండా ఉంటానా? అని ప్రశ్నించారు. హాస్పిటల్ కు వెళ్లినంత మాత్రాన ప్రాణాంతక వ్యాధులు ఉన్నట్టేనా? అని అన్నారు. ఇలాంటి ప్రచారాలు కేవలం తన విషయంలో మాత్రమే జరగలేదని... సీనియర్ గాయని సుశీల గారి విషయంలో కూడా ఇదే జరిగిందని గుర్తు చేశారు. సినీ పరిశ్రమకు చెందిన వారు చాలా సున్నితంగా ఉంటారని... ఇలాంటి వార్తలతో వారి కుటుంబీకులు చాలా ఆందోళనకు గురవుతారని చెప్పారు.