ప్యారడైజ్ పేపర్లలో ఉన్న ప్రతి ఒక్కరిని విచారించండి.. నా కుమారుడిని కూడా: యశ్వంత్ సిన్హా
- ప్యారడైజ్ పేపర్లలో యశ్వంత్ కుమారుడి పేరు
- జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరిని విచారించండి
- అమిత్ షా కుమారుడిని కూడా
ఈ నేపథ్యంలో, యశ్వంత్ సిన్హా స్పందించారు. తన కుమారుడిపై తప్పకుండా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్యారడైజ్ పేపర్లలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో... వారందరినీ విచారించాల్సిందేనని అన్నారు. 15 రోజుల్లోగా వీరందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడితో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జైషాను కూడా విచారించాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక జైషా కంపెనీ ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయంటూ 'ది వైర్' అనే వెబ్ సైట్లో ఇటీవల కథనం వచ్చింది.